
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల స్పందన అనాధ శరణాలయంలో ‘ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ యూనియన్ డే’ సందర్భంగా పిల్లలకి జమ్మికుంట బ్రాంచ్ ఉద్యోగులు నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు పదివేల విలువ చేసే బియ్యము, పప్పు దినుసులు, నూనెలు తదితర నిత్యవసర వస్తువులను నిర్వాహకులకు అందించారు. అనాధ పిల్లలని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేష్, డి జి ఎస్ సంతోష్, రీజినల్ సెక్రెటరీ పోచయ్య, జమ్మికుంట బ్రాంచ్ లోకల్ సెక్రెటరీ సొల్లు దేవేందర్, రాము, చక్రధర్ రావు, భాష, రాహుల్, శంకర్ తదితర ఉద్యోగులతో పాటు, ఇతర బ్రాంచీల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



స్పందన అనాధ శరణాలయంలో నిత్యవసర వస్తువులు అందజేస్తున్న ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు





