
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): ఆరుగాలం కష్టపడి శ్రమించే రైతన్నలు ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్లేందుకు బురదమయమైన మార్గము గుండా వెళుతుండడంతో వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ ముందడుగు వేశాడు. వీణవంక మండలంలోని లస్మక్కపల్లి గ్రామం నుండి మామిడి తోటకు లస్మక్కపల్లి నుండి కాపులపల్లె వెళ్లే రహదారితో పాటు ఆ మార్గంలో ఉన్న పొలాలకు ప్రతినిత్యం రైతులు వెళుతూ ఉంటారు. ఈ వర్షాకాలంలో ఆ రహదారి బురద మయంగా మారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని ముందు చూపుతో ప్రశాంత్ తన సొంత ఖర్చులతో దాదాపు 150 ట్రిప్పుల మొరం పోయించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తన వంతు సహాయంగా రహదారి ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు రైతులు ప్రశాంత్ సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు దాసరపు లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, సమ్మిరెడ్డి, కోమల్ రెడ్డి, సంపత్, రాజిరెడ్డి, కుమార్, కొండల్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

