
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వేద భారతి విద్యాపీఠం, హన్మకొండ స్థాపకులు కూర్మాచలం వెంకటేశ్వర్లు హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ దాతల సహకారంతో అదే ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 2024౼2025 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాల(541 marks) టాపర్ గా నిలిచిన కొండి సాహిత్యకు ఉన్నత చదువుల నిమిత్తం రూ. 50,000 (యాబై వేల రూపాయలు) మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపతి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థికి నగదు అందించి అభినందించారు. చక్కగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్న ఊరుకు, చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొని అభినందించారు.

కొండి సాహిత్యకు రూ. 50 వేల నగదును అందజేస్తున్న ఎంఈఓ శ్రీనివాస్, దాత వెంకటేశ్వర్లు, పాల్గొన్న ఉపాధ్యాయులు..