
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యాత్రికుల సౌకర్యార్థం హుజురాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈనెల 27న యాదగిరిగుట్ట, స్వర్ణగిరి మరియు వరంగల్ భద్రకాళి ఆలయాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.ఈ బస్సు హుజురాబాద్ నుండి ఉదయం 4:00 గంటలకు బయలుదేరి అదే రోజున సాయంత్రం 5:00 గంటలకు తిరిగి హుజురాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికుల కోసం వోటర్ బాటిల్ మరియు అల్పాహారం సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రయాణ ఛార్జీలు పెద్దలకు రూ.700/-, పిల్లలకు రూ.400/-గా నిర్ణయించబడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25924, 97048 33971, 92471 59535, 94414 04841 నెంబర్లలో సంప్రదించవచ్చని, అలాగే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

