
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపిన ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఏటిసి(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయడం పట్ల హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం విద్యారంగంపై అధిక దృష్టి వహిస్తుందని, ఈ సెంటర్ మంజూరు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనీ యువతీ, యువకులకు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి, ఉద్యోగ కల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో యువత భవిష్యత్ కు సంబంధించి దృష్టిసారిస్తానని నిరుద్యోగ యువతి, యువకులకు అండగా ఉంటానని ఇచ్చిన హామీ మేరకు అమలుపరిచేలా కృషి చేస్తున్నానన్నారు.


ఏటీసీ సెంటర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు..

ఏటీసీ సెంటర్ మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ నేత ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న నియోజకవర్గ ప్రజలు..