
– సీఎం, రెవెన్యూ మంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన వి.లచ్చిరెడ్డి
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: రెవెన్యూ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్(అదనపు కలెక్టర్లు)గా నియామకాన్ని చేపట్టిందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ తెలిపారు. 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, ఇతర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టునే చివరిదిగా ఉండేదని ఈ సందర్భంగా లచ్చిరెడ్డి, రామకృష్ణ తెలిపారు. ఇదే విషయమై డిప్యూటీ కలెక్టర్ల సంఘంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి దానిని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(అదనపు కలెక్టర్)గా 33 పోస్టులను సాధించామన్నారు. రెవెన్యూ చరిత్రలోనే తొలిసారిగా 33 మందికి పోస్టులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి సత్కరిస్తున్న డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, ఇతర ఉద్యోగ సంఘం నాయకులు.





