
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 30 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల తరచుగా మొబైల్ ఫోన్లు పోతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై టౌన్ సీఐ కరుణాకర్ స్పందించి ఆయన నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో భాగమైన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ద్వారా నూతనంగా టెక్నాలజీని వినియోగించి, మొత్తం లక్ష రూపాయల విలువైన ఐదు మొబైల్ ఫోన్లను గుర్తించి చోరీ అయిన వారి వద్ద నుండి రికవరీ చేసి సోమవారం తిరిగి బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాధితులు తమ ఫోన్లు తిరిగి అందించినందుకు ఇన్స్పెక్టర్ కరుణాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లు పోయిన పక్షంలో బాధితులు తప్పనిసరిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR సాంకేతికతను ఉపయోగించి ఫోన్లు ట్రేస్ చేసి తిరిగి అందజేయవచ్చని ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోగొట్టుకున్న మొబైల్ లను గుర్తించి తిరిగి బాధితులకు అప్పగిస్తున్న సిఐ కరుణాకర్..





