
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్ ని మరియు హుజురాబాద్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్సై రాధాకృష్ణని ఆ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి బొకేలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అంకితభావంతో నీతి నిజాయితీతో విధి నిర్వహణలో నిర్వర్తించి హుజురాబాద్ కు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, డివిజనల్ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్, బీసీ కుల గణన మండల కన్వీనర్ మార్త రవీందర్, బీసీ సంఘం నాయకులు మంద బిక్షపతి, పోతరాజు సంపత్, చనుమల్ల ప్రసాద్ బాబు, ఇరవేనా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్ కి పూల బొకే ఇచ్చి శాలువా కప్పి సత్కరిస్తున్న బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు…

———————–++++++———————–
@పత్రికా ప్రకటన(యాడ్స్)లు &
———————+++++++————————
