
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి (ఎడ్ల) సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం రోజున యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు బిజిగిరిషరీఫ్ గ్రామంలోని మృతుడు రాచపల్లి (ఎడ్ల) సమ్మయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఆయన కుమారులు రాచపల్లి, అంబేద్కర్ రాచపల్లి జగ్జీవన్ లను మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాచపల్లి (ఎడ్ల) సమ్మయ్య మృతి వారి కుటుంబానికి తీరని లోటని రాచపల్లి ఎడ్ల సమ్మయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని కోరారు. ఆయన వెంట జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాచపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, రాచపల్లి రాజు తదితరులు ఉన్నారు.


మృతుడు రాచపల్లి (ఎడ్ల) సమ్మయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేస్తున్న యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు
————————-+++++++———————–
*పత్రికా ప్రకటనలు (యాడ్స్)*
——————————+++++++————-
