
– సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 6: హుజురాబాద్ డివిజన్లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం విజయ్ పాల్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ హాస్టళ్ళలో ఉచిత విద్య, భోజన వసతితో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఖాళీలు: ప్రీ-మెట్రిక్ హాస్టల్స్ (3వ తరగతి నుండి 10వ తరగతి వరకు): హుజురాబాద్: బాలురు – 71, బాలికలు – 78, జమ్మికుంట: బాలురు – 35, బాలికలు – 82 వావిలాల: బాలురు – 88,వీణవంక: బాలురు – 70, రేకొండ: బాలురు – 77, చిగురుమామిడి: బాలురు – 81, నుస్తులాపూర్: బాలురు – 72, ఇందుర్తి: బాలురు – 78, తిమ్మాపూర్: బాలికలు – 215,పోస్ట్-మెట్రిక్ హాస్టల్స్ (కాలేజీ విద్యార్థులు): హుజురాబాద్: బాలురు – 170, జమ్మికుంట: బాలికలు – 130 ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా కల్పించే సౌకర్యాలు, ప్రత్యేకతలు: ఈ హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు నోట్‌బుక్స్, నాలుగు జతల దుస్తులు, బెడ్‌షీట్, కార్పెట్, షూస్, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్ అందిస్తామని ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించబడుతుందని పేర్కొన్నారు. ఇందులో ఉదయం రాగి జావ/పాలు/పండ్లు, టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి. వారానికి రెండుసార్లు (గురువారం, ఆదివారం) చికెన్ లేదా బగారా అన్నం అందిస్తారు. రాత్రి భోజనంలో అన్నం, ఆకుకూరలు/కాయగూరలు, పప్పు, రసం, మజ్జిగ, ఉడికించిన గుడ్డు ఉంటాయి. అదనంగా, విద్యార్థులకు బంకర్ బెడ్స్, ప్లేటు, గ్లాసు, ట్రంక్ పెట్టె, దుప్పట్లు, పరుపు, దిండు, స్పోర్ట్స్ షూ, స్కూల్ షూ ఉచితంగా అందజేస్తామని, కాస్మెటిక్ ఛార్జీల కింద బాలురకు నెలకు రూ. 150-200, బాలికలకు నెలకు రూ. 175-275 చెల్లిస్తారు.
అదనపు తరగతులు, ఇతర సౌకర్యాలు:
పదవ తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో ట్యూటర్లచే ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, స్పోర్ట్స్ మెటీరియల్, టీవీ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. విద్యా సంవత్సరంలో ఉచిత విజ్ఞాన విహారయాత్రలు కూడా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 4 ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనఫైడ్ (ఒరిజినల్), ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ సమర్పించాలి.
మరిన్ని వివరాల కోసం హుజురాబాద్ డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డిని 9399957766 నంబర్లో సంప్రదించవచ్చు అని తెలిపారు.

సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. విజయ్ పాల్ రెడ్డి.
————————++++++++—————–
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————–++++++++++——————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






