
– శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలను సాకారం చేస్తున్న బిజెపి ప్రభుత్వం
– అఖండ భారత్ స్వప్నికుడు శ్యామ
ప్రసాద్ ముఖర్జీ
–బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంబేద్కర్ చౌరస్తా హుజురాబాద్ లో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా తూర్పాటి రాజు మాట్లాడుతూ 6 జులై 1901 కలకత్తాలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మించాడన్నారు. గొప్ప దేశభక్తి, దూర దృష్టి గల నాయకుడు, విద్యా వేత్త, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. దేశం కోసం జీవించారనీ దేశం కోసం మరణించారనీ, దేశం కోసం అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు అనే చట్టాన్ని తిరస్కరించాలని అఖండ భారత దేశం కోసం 1953 జూన్ 23న తన జీవితాన్ని అర్పించిన పుణ్యాత్ముడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే కలకత్తా విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారన్నారు. వి ద్యా, రాజకీయ, సమాజం సంస్కృతి ఇలా అన్ని రంగాలలో గణనీయమైన కృషి చేశారన్నారు. వారు జీవించి ఉన్నంతకాలం సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని వారి సిద్ధాంతాలకు వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ ప్రయాస్ సబ్ కా విశ్వాస్ అనే మంత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకుంటాడని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తే కచ్చితంగా రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజలంతా బిజెపి వైపే ఉన్నారని తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, కో కన్వీనర్ బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్ సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, సబ్బని రమేష్, మొలుగురి నాగరాజు, ఇలాసాగరం వీరస్వామి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, బూత్ అధ్యక్షులు క్యాస వెంకటేష్, గుడిపాటి కొండల్ రెడ్డి, చత్తర్ సింగ్, మోలుగురి అపర్ణ, గరిగే శివకృష్ణ, నీలం రవీందర్, మోలుగురి నగేష్, పర్థం రాము, పర్థం అనిల్, తూర్పాటి సునీల్, విజయ్, రమేష్, శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


పార్టీ ఆఫీస్ వద్ద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న బిజెపి నాయకులు..

మొక్క నాటుతున్న బిజెపి నాయకులు…
—————+++++++———————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
——————–+++++++++—————–
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






