Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి జెడ్ పి సెకండరీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు హుజురాబాద్ కేడి సిసి బ్యాంకు ఆధ్వర్యంలో సహకార బ్యాంకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ సహకార దినోత్సవoను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కేడీసీసీ బ్యాంకు మేనేజర్ ఏ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ…సహకార బ్యాంకుల పనితీరు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, రైతులకు మహిళలకు విద్యార్థులకు సహకార బ్యాంకులు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయని అన్నారు. సహకార బ్యాంకులు ప్రజల సహకారంతో వారికి ఆర్థిక సేవలు అందించడంలో ముందున్నాయని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ లాల్ మహ్మద్, హెచ్ఎం రాజిరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్, పలువురు బ్యాంకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






