
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు జాగృతి అధ్వర్యంలో సంవత్సర కాలంగా కవితక్క నాయకత్వం పోరాటం నిరంతర పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బిసి రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ తీసుకురావడం ముమ్మటికి ఇది బడుగు బలహీన వర్గాల విజయంగా తెలంగాణ కుల సంఘాల నాయకులు బడుగు బలహీన వర్గాల ప్రజలు భావిస్తున్నారనీ యుపిఎఫ్ రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలయాపన చేయడంతో కవితక్క గత సంవత్సర కాలంగా నిరంతరం బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన 42 శాతం రిజర్వేషన్ అమల చేయాలనే ఏకైక లక్ష్యంగా అందరినీ కలుపుకుని ఉద్యమం చేయడం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆర్డినెన్స్ తేవడం అంటే ఈ రాష్ట్రంలో బిసిల శకం ప్రారంభం అయిందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. అంతకుముందు హైదరాబాద్ లో కవితక్కను కలిసి పూల బొకే ఇచ్చి గుంజపడుగు హరిప్రసాద్, అసలు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు గొట్టం మహేష్, పోన్నం అనిల్ గౌడ్, భారతం అఖిల్, చరణ్ తదితరులు ఉన్నారు.

కవితక్కకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న గుంజపాడుగు హరిప్రసాద్ తదితర నాయకులు..





