
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (జమ్మికుంట): నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం ఇంటింటికీ మన కౌశిక్ అన్న కార్యక్రమం ద్వారా CMRF చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు.
“నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని, ఎవరికైనా సమస్య ఉంటే అది నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను,” అని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుందని అన్నారు.
వివిధ ప్రాంతాల్లో చెక్కుల పంపిణీ వివరాలు:
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం జమ్మికుంట మండలంలో మాచనపల్లి, జగ్గయ్యపల్లి, అంకుశాపూర్, కోరపల్లి, బిజ్జిగిరి షరీఫ్, వావిలాల, నగురం, నాగారం ఇల్లందకుంట మండలంలో రాచపల్లి, టేకుర్తి, మర్రివానిపల్లి, మల్యాల, లక్ష్మాజీపల్లి, కనగర్తి, ఇల్లంతకుంట గ్రామములలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
కార్యకర్తలతో నిండిన బలమైన పార్టీ – బీఆర్ఎస్
“బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడైనా కష్టాల్లో ఉంటే, వెంటనే అండగా నిలుస్తాం. పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా మాకు సమానంగా ముఖ్యమైనవారే,” అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన వొల్లల రవి గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ 2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి తన పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.
▪️ జమ్మికుంట టౌన్ – ₹6,20,000 విలువైన 19 చెక్కులు
▪️ జమ్మికుంట రూరల్ – ₹2,77,000 విలువైన 13 చెక్కులు
▪️ ఇల్లంతకుంట మండలం – ₹2,31,000 విలువైన 13 చెక్కులు
తులం బంగారం ఏమైంది..? – కాంగ్రెస్‌పై కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తు
కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు:
• “తులం బంగారం ఇస్తామన్నారు, కానీ అమలు కాలేదు.”
• “కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రైతులు సాగునీటి కొరతతో బాధపడుతున్నారు.”
• “రైతు భరోసా అందరికి చేరటం లేదు.”
• “ఉచిత బస్సుపై ప్రకటనలు చేశారుగానీ, బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.”
“ప్రజల సమస్యలపై మాట్లాడితే కేసులు, అరెస్టులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోరాటాల్ని అణచాలని చూస్తోంది. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారు.”
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు,పింగిళి రమేష్ ,సత్యనారాయణ రావు మనోహర్ రావు ,పొనగంటి సంపత్ ,తోట లక్ష్మణ్ ,తిరుపతి రావు పర్లపల్లి రమేష్ ఇల్లందకుంట మండలంలో సరిగొమ్ముల వెంకటేష్ ,చుక్క రంజిత్ ,పోడేటి రామస్వామి కొమురెల్లి ,కుమార్ ,అశోక్ ,మొగిలి, దిలీప్ రెడ్డి ,రాజు ,మహేందర్ రాకేష్ ,ఐలయ్య ,రామ్ స్వరణ్ రెడ్డి జమ్మికుంట మాజి కౌన్సిలర్లు దిలీప్ ,భాస్కర్ ,రమేష్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

మృతి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
——————–+++++++++—————–
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
—————–++++++++++—————
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






