
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో సైదాపూర్ రోడ్డులోని స్థానిక వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు విజయగిరి చంద్రసేన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గోగుల శబ్ద ప్రకాష్ ను టాప్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శనిగరం నరేందర్, చీకట్ల సమ్మయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగంలో ఉత్తమ సేవలను అందించిన ఇరువురిని అభినందించారు. ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఎలాంటి పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ పిఎస్ సిపిఎస్ విధానాన్ని రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగులో ఉన్న ఐదు డీఏలను విడుదల చేస్తూ, నూతన పి ఆర్ సి ని జూలై 2023 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్స్, ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమును తక్షణమే అమలుపరుస్తూ, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, జమ్మికుంట శాఖ అధ్యక్షుడు గరిగే చంద్రయ్య, హుజురాబాద్ శాఖ కోశాధికారి మండల వీరస్వామి, సంఘ బాధ్యులు గౌరీశెట్టి సాంబయ్య, తాళ్ల రామకృష్ణ, తాటిపాముల కనకయ్య, తౌటం శ్రీహరి, దొంత హరికిషన్, గుడిపాటి స్వామిరెడ్డి, ముక్కెర మొగిలి, గాజర్ల బుచ్చిరాజం, గాజ గంగయ్య, పెద్దపేట రమేష్, భారత ప్రభాకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


పదవి విరమణ చేసిన ఉద్యోగులను సన్మానిస్తున్న టాప్ర సంగం నాయకులు..
————————+++++++———————-
&పత్రికా ప్రకటన (యాడ్స్)లు&
——————–+++++++++———————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#
