
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ ఏసీపీ వీ మాధవి భర్త ఏసీపీ మహేష్ బాబు మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని రైతు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహేష్ గతంలో సీఐగా ఏసీపీగా ప్రస్తుతం పిటిసి ఇన్చార్జిగా కొనసాగుతూ పోలీస్ శాఖకు మహేష్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వున్న హుజురాబాద్ ఏసిపి మాధవికి, ఆమె పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను అని రామారావు తెలిపారు.

ఏసీపి మహేష్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్న రైతు సంఘం నాయకుడు పోలాడి రామారావు.





