
– కౌశిక్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే భయం,అందుకే సీఎం ఫోటో లేకుండా చెక్కుల పంపిణీ.
– పదేళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల పంపిణీ.
– జమ్మికుంట పట్టణ,వీణవంక,జమ్మికుంట మండలాల పరిధిలోనీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.
– ఏకే 47 అయి జనాలను హింసిస్తావా?
– కాంగ్రెస్ లో ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డిపై అనేక కేసులు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (జమ్మికుంట): జనాల సమస్యలు పట్టించుకోవడానికి సమయం లేదు కానీ, నాపై కన్ను పెడితే ఏకే 47 గన్ను అవుతానని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ, ఆ గన్ను ప్రజలపై గురి పెట్టడానికి తిరుగుతున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. శుక్రవారం నాడు జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. జమ్మికుంట మండలానికి సంబంధించి 17 చెక్కులు, పట్టణానికి 18, వీణవంక మండలానికి సంబంధించి 26 మందికి 23 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రణవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళులో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో చేసి చూపెట్టామని, పదేళ్ళు అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే హుజురాబాద్ నియోజవర్గానికి నూతనంగా 8,700 రేషన్ కార్డులు ఇచ్చామని, 12 వేల మందికి రేషన్ కార్డులో నెంబర్ ఆడిషన్స్ ఇచ్చామని ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం లాంటివి పథకాలు ప్రవేశపెట్టామని ఇది చరిత్ర మరువని నిజం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కౌశిక్ రెడ్డిపై కక్ష్యపూరితంగా వ్యవహరించలేదని తన ప్రవర్తన వలనే కేసులు అవుతున్నాడని, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బిఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డికి భయం..
సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భయమని, అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే సమయంలో రేవంత్ రెడ్డి ఫోటో తీసి పంపిణీ చేస్తున్నారని, ప్రోటోకాల్, ప్రోటోకాల్ అని చెప్పుకుంటూ తిరిగే కౌశిక్ రెడ్డికి సీఎం ఫోటో లేకుండా చెక్కుల పంపిణీ చేయడం ఏ ప్రోటోకాల్ అని ప్రశ్నించారు?. సమయానికి చెక్కులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని, వచ్చిన చెక్కులను ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడనీ, ఏం నొప్పి వస్తుందని ప్రశ్నించారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని చెక్కులు వచ్చిన వెంటనే అందజేయాలని అధికారులకు ప్రణవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధి పొందిన వారితో కాంగ్రెస్ నేత ప్రణవ్..

సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్…





