
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న మాధవి భర్త మహేష్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పోలీస్ శాఖలో అంకిత భావంతో పని చేసిన మహేష్ అకస్మాత్తుగా మృతి చెందడం అతని కుటుంబానికి తీరని నోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
–





