
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి భర్త కరీంనగర్ పీటిసి ఏసీపీ జి మహేష్ అకస్మాత్తుగా మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ శాఖకు మహేష్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వున్న హుజురాబాద్ ఏసిపి మాధవికి, ఆమె పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుతున్నానని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నట్లు అర్జున్ తెలిపారు.

గుండెపోటుతో మృతి చెందిన పిటిసి ఏసిపీ మహేష్ బాబు (ఫైల్)





