Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రిటైర్డ్ ఆర్టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులంతా హైదరాబాద్ బస్సు భవన్ ను ముట్టడిస్తామని తెలంగాణ రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం హుజురాబాద్ డివిజన్ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల మహాసభ హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…రిటైర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్, 2017 ఏరియర్స్, అయ్యర్ పెన్షన్ డబ్బులు కట్టిన వారికి అందరికీ పెన్షన్ డబ్బులు అందేలా చూడాలని అన్నారు. ఏరియర్స్ విషయంలో ఆర్టిసి పిఎఫ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని అయినప్పటికీ పరిష్కారం కావడం లేదని అన్నారు. ఇతర ఉద్యోగుల కన్నా తక్కువ వేతనాలు అధిక శ్రమ ఆర్టీసీ కార్మికులు చేస్తారని, రిటైర్మెంట్ తర్వాత నామమాత్రపు పెన్షన్ ఉంటుందని అలాంటి చిరు రిటైర్మెంట్ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని లేకుంటే పిఎఫ్ ఆఫీస్ ను,
ఎండి ఆఫీస్ బస్సు భవన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ మహాసభలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు ఆర్ చారి, జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, వేల్పుల రత్నం, రాష్ట్ర కార్యదర్శి పంజాల వెంకటయ్య, రాష్ట్ర నాయకులు నాగరాజు, కే నారాయణ, వేల్పుల ప్రభాకర్, మార్త రవీందర్, నరసయ్య, లక్ష్మణరావు, రెడ్డి సంపత్ కుమార్, రంగు పండరి, బత్తిని సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, సామాజిక ఉద్యమ నేత వేల్పుల రత్నం,
రాష్ట్ర కార్యదర్శి పంజాల వెంకటయ్య, రాష్ట్ర నాయకులు నాగరాజు, కే నారాయణ, రాష్ట్ర అధ్యక్షులు సమక్షంలో
హుజురాబాద్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘం గౌరవ అధ్యక్షునిగా
ఒడితల ప్రణవ్ బాబుని ఏకగ్రీవంగా సభ ఆమోదంతో ఎన్నుకోవడం జరిగిందన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా
వేల్పుల ప్రభాకర్, అధ్యక్షుడిగా మార్త రవీందర్, ఉపాధ్యక్షులుగా ఈవిఆర్ నరసయ్య, వివిఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా
పేరాల లక్ష్మణరావు, సహకార కార్యదర్శిగా గోలి ఉపేందర్,
పోరెడ్డి సమ్మిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ ఆగయ్య, బి మల్లయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి రాజమౌళి,
ప్రచార కార్యదర్శిగా ఏం రాజమౌళి, కోశాధికారిగా
ఏ బాబు రెడ్డి, కమిటీ సభ్యులుగా పుల్ల ఏసోబు,
ఏ స్వామి, డివై గౌడు, ఎస్ ప్రభాకర్, కే కొమురయ్య, ఎండి సర్దార్, కొంపల్లి వెంకట్ రెడ్డి, రావుల రఘుపతి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.







