Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈనెల 21వ తేదీ సోమవారం రోజున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆదివారం సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జాబు మెలకువసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అర్హత ఆసక్తి ఉన్న నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన యువతీ యువకులు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు. ఉదయం పదిగంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, దేశంలోని ప్రముఖమైన 70 కంపెనీలు హాజరవుతాయని, 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.






