
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య భర్త కేసిరెడ్డి నరసింహారెడ్డి ఇటీవల కాలుకు స్వల్ప గాయం కాగా.. హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. నరసింహారెడ్డి గాయపడ్డ తీరును ఆయనను వివరాలు అడిగి తెలుసుకున్నారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సీనియర్ పాత్రికేయుడు నరసింహారెడ్డి కాలుకు గాయం కాగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..



నరసింహారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకుని, స్థానిక వాడ ప్రజలతో గ్రూప్ ఫోటో దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు..





