
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏసీపీ మాధవి భర్త పోలిస్ ట్రైనింగ్ సెంటర్ DSP మహేష్ బాబు ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి నివాసంకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు వెళ్ళి మహేష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏసీపీ మాధవికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్, ధర్మారం PACS చైర్మన్ కటంగూరి శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు కే కిరణ్, సీనియర్ నాయకులు చందమల్ల బాబు, నరేష్, దుబాసి బాబు, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మహేష్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్

మహేష్ కుమార్లను ఓదార్చుతున్న ప్రణవ్ …


ఏసిపి మాధవిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రణవ్, కాంగ్రెస్ నాయకులు..





