
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ సహకార శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కు అసిస్టెంట్ రిజిస్టార్ గా ప్రమోషన్ పొందిన సందర్భంగా హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ పట్టణంలో మురాద్ నగర్ ఎంఎం భవనములో మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కు ఘన సన్మానం చేశారు. మసీద్ కమిటీల అధ్యక్షుల మరియు జమాతే ఉలేమ సంఘ ఆధ్వర్యంలో కరీంనగర్ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కు శాలువా కప్పి, పుష్పగుచ్చాల ఇచ్చి స్వీట్లు తినిపించి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కరీంనగర్ జిల్లా సహకార శాఖ ఉద్యోగుల అధ్యక్షులుగా కొనసాగుతూ మరియు టీఎన్జీవోస్ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ ఉద్యోగుల కొరకు ఉద్యోగుల సంక్షేమం కొరకు పని చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారన్నారు. అలాగే హుజురాబాద్ పట్టణంలో ఏక్ మినార్ మస్జిద్ అధ్యక్షులుగా మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కొనసాగుతున్నారు. జలాలుద్దీన్ అక్బర్ కు సన్మానం చేసిన వారిలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు జామే మజీద్ ముఫ్థీ హమ్మద్ షాకిర్ అహ్మద్, మిర్జా ఇమ్రాన్ బేగ్, మహమ్మద్ సోహెల్, మహమ్మద్ ముజామిల్, మొహమ్మద్ నవాబ్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్ బాబా, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ నూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ సహకార శాఖలో గజిటెడ్ ఉద్యోగుల సంఘములో సభ్యత తీసుకొని ఉద్యోగుల సంక్షేమం కొరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనకు విజ్ఞప్తి చేశారు.



జలాలుద్దీన్ అక్బర్ కు ఘనంగా సన్మానిస్తున్న హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తదితర మైనార్టీ నాయకులు..





