
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్లో నిర్వహించిన విద్యనికేతన్ స్కూల్ 1994-1995 7th క్లాస్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ వృత్తులు మరియు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నా వారంతా 30 ఏళ్ల తరువాత అందరూ ఒకే చోట చేరి రోజు అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆట పాటలతో గడిపారు. పాత జ్ఞాపకాలము నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు మాధవరావు, సత్యనారాయణరెడ్డి, వెంకట్ ప్రసాద్, ముజమిల్ అహ్మద్, దుర్గాజీ, ఫరీదా, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.







