Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ గౌడ్ విద్యుత్ షాక్ తో మరణించగా మృతుడి కుటుంబాన్ని నాగార్జున డేయిరి సీఇఒ కృష్ణప్రసాద్, ఏజియం ఆకునూరి సుధాకర్ పరామర్శించడం జరిగింది. ఏజియం సుధాకర్ మాట్లాడుతూ కాంట్రక్ట్ పద్ధతిపై గత రెండు సంవత్సరాల నుండి గ్రామాల నుండి ఆటో ట్రాలీ ద్వారా డెయిరికి పాలు తీసుకువచ్చే మూల రాకేష్ విద్యుత్ ఆటో ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించిన విషయం తెలుసుకున్న డైరీ యండి ప్రభాకర్ రావు వారీ కుటుంబానికి లక్ష రూపాయలు (1.00.000) అందించమని ఆదేశించగా అందించామన్నారు. డేయిరిలో వాహనములు నడుపుతున్న వారందరికీ ఎల్ ఐసీ ద్వారా సాధారణ భీమా చేయించడం జరిగిందనీ, అవి 40.0000/-రూ కూడా అందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శ్రీనివాస్, సంతోష్, రాహుల్, సూపర్ వైజర్లు బోడిగే నరేష్, స్వామి, స్థానిక సర్పంచ్ సంపత్, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు.

రాకేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కు అందజేస్తున్న నాగార్జున డేయిరి సీఇఒ కృష్ణప్రసాద్, ఏజియం ఆకునూరి సుధాకర్..





