
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా (పాత కరీంనగర్) నూతన కమిటీని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల భవనంలో పంబాల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో జిల్లా అధ్యక్షుడిగా గంట శ్రీనివాస్- సీనియర్ న్యాయవాది, ప్రధాన కార్యదర్శిగా కొరిమి పీతాంబర్- మాజీ సర్పంచ్, ఉపాధ్యక్షులుగా గుంటి నవీన్- ఉపాధ్యాయులు, సంయుక్త కార్యదర్శిగా గుంటి శిరిడి సాయిబాబా- సాఫ్ట్వేర్ ఉద్యోగి, కోశాధికారిగా గుంటి నరసింహస్వామి- ప్రభుత్వ ఉద్యోగి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా గుంటి రాజమౌళి- ఏఎస్ఐ పోలీస్ శాఖ, గంట వెంకటయ్య- విశ్రాంత ఉద్యోగి, గుంటి భిక్షపతి- ప్రభుత్వ ఉద్యోగి, గంట అశోక్ సత్యనారాయణ- విశ్రాంత ఉద్యోగి, గౌరవ సలహాదారులుగా కొరిమి నరసింహస్వామి- విశ్రాంత జైలర్, ప్రవీణ్ కుమార్- న్యాయవాది, విష్ణువర్ధన్- వాణిజ్య పనుల శాఖ అధికారి, శ్రీధర్, రాములు, రవీందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ భవిష్యత్ కార్యాచరణ, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు వారి పదోన్నతులు, ఉన్నత చదువుల కోసం కావాల్సిన క్యాస్ట్- కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం మొదటగా ఆయా రెవెన్యూ అధికారులతో చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. వృత్తిపరమైన అంశాలు, ఇతర సమస్యలపై దశలవారీగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.

సమావేశంలో మాట్లాడుతున్న గౌరవ సలహాదారులు కొరిమి నరసింహస్వామి- విశ్రాంత జైలర్…





