Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ఆదివాసీల హక్కులకోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూ సోరేన్ చేసిన అలుపెరుగని పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు శిబూ సొరేన్ ఎన్నోసార్లు జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ బహిరంగ సభల్లో స్వయంగా వచ్చి అనేక సార్లు పాల్గొని సంఘీభావం ప్రకటించారని రామారావు తెలిపారు. ఆయన పోరాట పటిమ తోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి నూతన జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. మూడు సార్లు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 8 సార్లు లోకసభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్య సభ సభ్యుడిగా శిబూ సొరేన్ ప్రాతినిద్యం వహించడం విశేషమని,ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు.
శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లో ఆయన మద్దతు మరువలేనిదని అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం రైతాంగ సమస్యలపై పార్లమెంట్ లో ఆయన గళం అమోఘం అలాంటి నాయకులు నేడు అరుదు అని నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబ సభ్యులకు రైతు ప్రజాసంఘాల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు.

———————-++++++++———————-
&పత్రికా ప్రకటనలు&
——————–++++++++—————————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






