
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో చెల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వైద్యులు మధుకర్ మాట్లాడుతూ.. శిబిరంలో భాగంగా డ్రై డే ఇంటింటిని సర్వే పైరిత్రం ఇండోర్ స్ప్రే చేయడం జరిగిందని, రక్త నమూనాలు సేకరించి సీజన్ వ్యాధుల స్క్రీనింగ్ లను నిర్వహించమని తెలిపారు. ఈ సందర్భంగా నీటి నిల్వలను తొలగించి సీజన్ వ్యాధులకు కారణమయ్యే దోమల సంతతిని (లార్వా) నివారించే చర్యలు చేపట్టామని డాక్టర్ మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పల్ నర్సింగాపూర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వైద్యులు స్నిగ్ధ, హెచ్ ఈ ఓ విజేందర్ రెడ్డి, ఏ ఎన్ ఎం పద్మ,కవిత, హెల్త్ అసిస్టెంట్ సత్యం, ఆశ కార్యకర్తలు మంజుల, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది..







