
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల ఆర్యవైశ్య భవన్ లో వనభోజన కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పంపిణీ చేశారు. వన భోజనాన్ని పురస్కరించుకొని ఆర్య వైశ్య సంఘ సభ్యులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు అందజేశారు. పలువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక, నాయకులు గందే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు హరిశంకర్, నూక శ్రీనివాస్, సురేష్, నాగరాజ, నార్ల రాజేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, చందా చంద్రగుప్త, నార్ల శ్రీనివాస్, అనిల్, కాపర్తి అనిల్, కొమురవెల్లి హరిప్రసాద్, నార్ల నారాయణ, ఉమాశంకర్ ప్రభాకర్, మల్లేశం, శ్రవణ్, శశిధర్, గంగాధర్, విక్కీ, పూల్లూరి శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.








