
– ఈ నెల 8న ప్రాయశ్చిత్త హోమం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు నిఖిలాచార్యులు, నందకిశోరాచార్యులు, శ్రీహర్షచార్యులు, సుదర్శనా చార్యులు, రామాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విగ్రహాలను గూడూరు ప్రభాకర్ రెడ్డి సుమావాణి, ఊరడి సుధాకర్ రెడ్డి-సుగుణ, పీవీ నరేష్, సారయ్య- సుజాత, చందా నగేష్- జ్యోతి, రాజు, సురేందర్, గణపతిరెడ్డి బహూకరించారు. 6న నిత్య హోమం, ఆదివాస హోమం, జల, క్షీరాధివాసం, నిత్య పూర్ణాహుతి, 7న మూర్తులకు పంచామృతాభిషేకం, వాస్తు హోమం, నిత్య పూర్ణాహుతి, ఫల, పుష్క, శయ్యాధివాసం, ధాన్యాధివాస, 8న ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణాహుతి, ఉదయం 11.15గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రాణ ప్రతిష్ఠా, నేత్రోన్మలనం, కుంభప్రోక్షణ, ద్రిష్టి కుంభ, శాంతి కళ్యాణం, ఋత్విక్ గరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాసి సురేందర్ దంపతులు తోపాటు భక్తులు పాల్గొన్నారు.


——+-+++++++——+—–+—-+—–+-++++++
&పత్రికా ప్రకటనలు&
———-+—+-++++++————+—————-
#@వార్షికోత్సవ శుభాకాంక్షలు@#







