
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం బాలల హక్కులు, సామాజిక అవరోధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా బాలికలు, మహిళల సంక్షేమ శాఖ జిల్లా సమన్వయకర్త శైలజ, హుజురాబాద్ ఎంఈఓ బి శ్రీనివాస్ లు
బాలల హక్కులు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ , మొబైల్, సోషల్ మీడియా దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ విషయాలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
అవగాహన కార్యక్రమాలు బాలల భద్రత, భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూర్మాచలం వెంకటేశ్వర్లు, టి వెంకటప్రసాద్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతూన్న జిల్లా బాలికలు, మహిళల సంక్షేమ శాఖ జిల్లా సమన్వయకర్త శైలజ….
————-++++++++———————–
&&పత్రికా ప్రకటనలు&&
—————++++++++——————
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&







