
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల ముందు వృద్ధుల, వికలాంగుల పింఛన్లు పెంచుతామని నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ హెచ్చరించారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్లో ఈనెల 13న హైదరాబాదులో జరిగే వికలాంగుల వృద్ధుల మహా గర్జన విజయవంతంకై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ….ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన కాలంలో వికలాంగులకు, వృద్ధులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. వారు పరిపాలించిన కాలమంతా కేవలం నామమాత్రపు పింఛన్లే వచ్చాయని అన్నారు. అట్టడుగు వర్గాల బాధలు కన్నీళ్లు తెలిసిన తనకు వారి ప్రయోజనం కోసం పోరాటం చేశానని ఆయన అన్నారు. తన పోరాటం వల్లనే వృద్ధుల పెన్షన్లు పెరిగాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ టిడిపి ప్రభుత్వ హయాంలోనూ పింఛన్దారులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని పోరాటం చేయడం వలన రాజకీయ నాయకుల్లో చలనం వచ్చి పింఛన్లను పెంచారని అన్నారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు వృద్ధులకు అనేక వాగ్దానాలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 20 నెలల తర్వాత కూడా వారి ప్రయోజనం గురించి ఆలోచించడం లేదని అన్నారు. జీవన ప్రయోజనం కోసం ఉపయోగపడే పింఛన్లను పెంచడానికి వారికి బడ్జెట్ ఉండదని వందల కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులు వస్తాయి కానీ వికలాంగులకు వృద్ధులకు పింఛన్లు పెంచడానికి కనీసం ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వికలాంగులు వృద్ధుల పింఛన్దారులు ఉంటారని వీరందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయని, మాట తప్పితే త్వరలోనే సీటు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈనెల 13న హైదరాబాదులో జరిగే సభ కన్నా ముందే పింఛన్లను పెంపు చేయకపోతే కోటి మంది పింఛన్దారులు సీఎం గద్దె దించడానికి నడుం కడతారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మౌనం వీడాలని, ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడాలని అన్నారు. కేసీఆర్ లాంటి ప్రతి పక్ష నాయకుడు భారత దేశంలో ఎక్కడ లేడన్నారు. ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడనే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని అన్నారు.
పెన్షన్ పెంచకపోయినా ప్రతిపక్షం మౌనంగా ఉంటుందేమో కానీ ఎమ్మార్పీఎస్ మౌనంగా ఉండదని హెచ్చరించారు.
పెన్షన్ల పెంపు రేవంత్ సర్కారుకు రాజకీయ ఉరితాడుగా మారక తప్పదన్నారు.
పెన్షన్లు పెంచడమా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడమా తెలుసుకోవడమే సభ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, వి రవీందర్రావు, ఏమ్మార్పీఎస్ నాయకులు మారేపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వికలాంగుల సంఘం నాయకులు రాఘవుల శ్రీనివాస్ పలువురు వికలాంగుల సంఘ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
మహాగర్జన సన్నాహక సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో జరిగిన మహా గర్జన సన్నాహక సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న జరిగే మహా గర్జన సభకు హుజురాబాద్ మానకొండూర్ నియోజకవర్గాల నుండి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత చేనేత ఇతర పింఛన్ దారులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం చేయిత పింఛన్లు 6వేలకు పెంచుతామని తెలిపి మాట తప్పారని అన్నారు. పెంచుతామన్న పింఛన్లు పెంచకపోవడం వలన ప్రతినెల 1000 కోట్ల రూపాయలు, 20 నెలకు 20వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. పెన్షన్ మీద ఆధారపడ్డ వారి డబ్బులు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. కాలు చేతులు లేని వాళ్ళ పైసలు రైతు రుణమాఫీలా కింద వాడుకుంటారా… మీ జేబులు నింపుకోవడమే కావాలా… పేదల పింఛన్ల పై పట్టింపు లేదా… మీ ఇండ్లలో పింఛన్ల మీద ఆధారపడే వాళ్ళు లేరు కదా అందుకే వారి గోడ మీకు పట్టడా ప్రశ్నల వర్షం కురిపించారు. నేను పేద కుటుంబంలో పుట్టిన వాడిని, పేదలకు కష్టాలు వస్తే ఊరుకోనని, నా పేద ప్రజల సమస్య తీరేవరకు పోరాటం ఆగదని అన్నారు. రేవంత్ రెడ్డి పేదోడు కాదు కాబట్టే పేదోడి కష్టం తెలియదు, పేదవాడి పెన్షన్ పెంచడానికి మనసు రాదు అన్నారు. ఒకరు మోసం చేస్తున్నారు మరొకరు గడిలో పడుకుంటున్నారు అన్నారు. పేదోడి పెన్షన్లను ఎవరు పట్టించుకోవడంలేదని అన్నారు. రేవంత్ రెడ్డి దిల్లికి వెళ్లి బీసీ రిజర్వేషన్ అమలు కాకుంటే బిజెపి గద్దె దిగాలన్నారు, మా పేదల పెన్షన్లు కూడా మంజూరు చేయకపోతే మీరు కూడా గద్దె దిగాలన్నారు. రేవంత్ రెడ్డి తన పెన్షన్లు పెంపు మాటకు కట్టుబడి ఉంటే నేను వెయ్యి రెట్లు కట్టుబడి ఉంటానని అన్నారు. ఆగస్టు 13న జరిగే మహాగర్జన లోపే వాగ్దానం నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది పెన్షన్ తీసుకునే పింఛన్దారులతో ఏకమై వచ్చి తేల్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీహెచ్పీఎస్ జాతీయ నాయకులు గోపాలరావు, విహెచ్పిఎస్ హుజురాబాద్ మండల ఇన్చార్జి రాఘవుల శ్రీనివాసు, కో ఇన్చార్జి కే రవీందర్ రెడ్డి, మంతెన తిరుపతి, సిపి హెచ్ పిఎస్ దేవసాని ప్రియదర్శిని, హుజురాబాద్ మానకొండూర్ మండలాల నుండి వీహెచ్పీఎస్ జమ్మికుంట మండల ఇన్చార్జి ముత్యాల రంగయ్య, కో ఇన్చార్జి శనిగరపు రమేష్, వీహెచ్పీఎస్ వీణవంక మండల ఇన్చార్జి వడ్డేపల్లి రమేష్, కో ఇన్చార్జి అంతడుపుల సంపత్, వీహెచ్పీఎస్ ఇల్లంతకుంట మండల ఇన్చార్జి బోయిని మల్లయ్య, కో ఇన్చార్జి కౌతు సురేష్, వీహెచ్పీఎస్ తిమ్మాపూర్ మండల ఇన్చార్జి కొమ్ము సంపత్, సైదాపూర్ మండల ఇన్చార్జి జక్కోజు తిరుపతి, కో ఇన్చార్జి ఆవుల పద్మ, విహెచ్పిఎస్ మానకొండూరు ఇన్చార్జి కనకం కొమరయ్య, కో ఇన్చార్జి ఆరేల్లి బాబు, వి హెచ్ పి ఎస్ చిగురుమామిడి మండల ఇన్చార్జి శ్రీనివాస్ చౌదరి, గన్నేరువరం, కరీంనగర్, కేశవపట్నం తదితర మండలాల ఇన్చార్జులు, కొ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ కార్యముక్రమాన్ని ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, ఎంపీ ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, ఎంఎస్పి సీనియర్ నాయకులు సైదాపూర్ ఇన్చార్జి మారేపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ, ఎంఎంఎస్ జిల్లా కన్వీనర్ దండు వరలక్ష్మి మాదిగ, ఎమ్మార్పీఎస్ హుజురాబాద్ మండల ఇన్చార్జి మొలుగురు అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల ఇన్చార్జి అంబాల రాజు, కో ఇన్చార్జి మిట్టపల్లి రాజేష్, ఎమ్మార్పీఎస్ వీణవంక ఇల్లంతకుంట కేశవాపూర్ గన్నేరువరం తిమ్మాపూర్ మానకొండూర్ మండలాల ఇన్చార్జిలు కో ఇన్చార్జీలు పాల్గొని సన్నాహక సభను విజయవంతం చేశారు.


హుజురాబాద్ లో మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికి సత్కరిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..


బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి అభివాదం చేస్తున్న మందకృష్ణ మాదిగ…


మహాగర్జన సన్నాహక సభకు హాజరై మాట్లాడుతున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

మహా గర్జన సన్నాహక సభకు హాజరైన దివ్యాంగులు, మహిళలు..

మందకృష్ణ మాదిగకు రాఖీ కడుతున్న నాయకురాలు దేవసాని ప్రియదర్శిని…
——————-++++++++——————–
&పత్రికా ప్రకటనలు&
————–+++++++++———————–
#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#






