
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. విద్యార్థినీ విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషధాలుతో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్ని కృష్ణులు ఉట్టిని కొట్టేందుకు పోటీపడ్డారు. పాఠశాలలో జన్మాష్టమి వేడుకలతో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఎందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీతాషాజు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






మాంటిసోరి పాఠశాలలో ఆకట్టుకున్న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…





