
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో
గురువారం రోజున కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కృష్ణ, గోపిక వేషధారణలో పాఠశాలకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని, ప్రపంచానికి భగవద్గీత అందించిన కృష్ణుడి పుట్టినరోజు చాలా మంచి రోజు అని తెలియజేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో గోపిక, కృష్ణ వేషధారణలోని పిల్లలు నృత్యాలు చేశారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన ఫ్యాషన్ షో కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు పాల్గొని సందడి చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ఉట్టి కార్యక్రమం అందరిని ఆనందింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఉట్టి కొడుతున్న చిన్నారి కృష్ణులు, గోపికలు…

ఆకట్టుకున్న చిన్నారుల గోపిక, కృష్ణుడి వేషధారణలు..





