Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలోని మోడల్ చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా ఉందని దానిని అక్కడి నుండి వేరే చోటకి మార్చాలని కోరుతూ ప్రజాసంఘాల నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి ఖాళీదు హుస్సేన్ గురువారం మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. రెండో వార్డు, 17వ వార్డు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఓపెన్ జీమ్ ను గతంలో ప్రభుత్వo ఏర్పాటు చేసిందని కానీ ఓపెన్ జిమ్ లోకి మోడల్ చెరువు నీరు వస్తుండడంతో ప్రజలకు అది నిరుపయోగంగా ఉందని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మరోచోటికి ఆ జీమ్ ను మార్చాలని ఆయన కోరారు. దీంతో కమిషనర్ స్పందించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ప్రజాసంఘాల నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి ఖాళీదు హుస్సేన్





