
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ /ఆగస్టు 15: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి) హుజురాబాద్ బ్రాంచ్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బ్రాంచ్ ఎస్ బిఎం సిహెచ్ శ్రీధర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో భాగంగా జీవిత బీమా నూతన పాలసీలు మరియు వ్యాపారంలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను వారు నిర్వహించిన నూతన వ్యాపార పోటీలో విజేతగా నిలిచిన ఏజెంట్ మిత్రులందరికీ ఎల్ఐసి మెడల్ మరియు ఎల్ఐసి ట్రోపితో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బి.సమ్మయ్య, జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ గణేష్, ఏజెంట్స్ యూనియన్ LIAFI అధ్యక్షులు మోకిరాల సంపత్ రావు, ప్రధాన కార్యదర్శి మునిగల సమ్మరావ్, కోశాధికారి సంపత్ LIAFI నాయకులు, ఏజెంట్ మిత్రులు, డెవలప్మెంట్ ఆఫీసర్ లు, ఆఫీస్ సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, చందర్, గోరేమియ్య తదితరులు పాల్గోన్నారు.


ఎల్ఐసి కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడుతున్న ఎల్ఐసి ఎస్బిఎం శ్రీధర్…





