
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్” అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ లో గల “రత్నపాలి క్లినిక్” ముందు ఘనంగా “స్వాతంత్ర దినోత్సవ” వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం హుజూరాబాద్ మండల అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ జెండా ఎగరవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ.. భారతావని స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ల పోరాట ఫలితాన్ని ఎన్ని తరాలైన మర్చిపోలేమని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, వారి త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ త్యాగధనుల స్పూర్తితో వారు చూపిన మార్గంలో నడవాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుసంపన్నమైన భారతదేశం కోసం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సుంకరి మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సొల్లు మహేందర్, కోశాధికారి గుడిశాల సదానందం, జాయింట్ సెక్రెటరీ మంచికట్ల రవీందర్, ఉపాధ్యక్షుడు బింగి శ్రీనివాస్, మరియు ప్రభాకర్, సుధాకర్, రఘునాథం, రాజమల్లు, శ్రీకాంత్, తిరుపతి, దాసి రవీందర్, ఎల్లయ్య, దేవేందర్, సదానందం, దేవేందర్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ మండల ఆర్ఎంపి, పిఎంపీల సంఘం నాయకులు





