
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ జెండాకు అవమానం అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అది ఏదో అలా అనామకుడికి సంబంధించిన పోస్ట్ కాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల శాఖ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ నిన్న శుక్రవారం హుజరాబాద్ పార్టీ కార్యాలయంలో (జెండా ఆవిష్కరణ) స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్, ఇతర నాయకులందరూ జాతీయ జెండా ఎత్తిన తర్వాత దానికి వందనం(సెల్యూట్) చేస్తుండగా మండల శాఖ అధ్యక్షుడు కిరణ్ మాత్రం చేతులు కిందికి ముడుచుకొని నిలుచొని చూడడం కనీసం జెండాకు సెల్యూట్ చేయకపోవడం దీనంతటికీ కారణంగా నిలుస్తుంది. జాతీయ జెండాకు ఏ చిన్నపాటి అవమానం జరిగిన భారత రాజ్యాంగం ప్రకారం శిక్షార్హుడుగా ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎంతోమంది సాక్షిగా అందరూ చూస్తుండగానే జాతీయ జెండాకు సెల్యూట్ చేయవలసిన ఒక గౌరవ ప్రదమైన (కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు) హోదాలో ఉండి జాతీయ జెండాకు సెల్యూట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఏది ఏమైనా జాతీయ జెండాను అవమానించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ తీరుపై ప్రభుత్వం, అధికారులు, ఆ పార్టీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరీ!




జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తుండగా.. మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్ మాత్రం చేతులు ముడుచుకుని నిలుచొవడం పలు విమర్శలకు తావిస్తుంది.





