
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామినీ హుజురాబాద్ కు చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి శాలువా కప్పి సత్కరించి, హుజురాబాద్ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల గురించి విన్నవించారన్నారు. గడ్డం వెంకటస్వామి, గడ్డం వివేక్ వారి కుటుంబ సభ్యులతో సొల్లు బాబుకు గత 30 సంవత్సరాలుగా అవినాభావ సంబంధాలు ఉన్నట్టుగా సొల్లు బాబు తెలిపారు. మంత్రికి ఈ ప్రాంతంలో యూరియా బస్తాల కొరత గురించి, రైతుల కష్టాలను మంత్రికి వివరించినట్లు సొల్లు బాబు, రిటైర్డ్ టీచర్ సొల్లు బాబు, కొత్తకొండ రైతు సిద్దమల్ల కుమారస్వామి తదితరులు వివరించినట్లు తెలిపారు. దీనితో మంత్రి తక్షణం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు తెలిపారు.

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని శాలువతో సత్కరిస్తున్న హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేతలు సొల్లు బాబు, సారయ్యలు..





