
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రీ కృష్ణాష్టమి వేడుకలు హుజురాబాద్ లో ఘనంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో, గాంధీనగర్ చౌరస్తాలో, కరీంనగర్ రోడ్డు పెట్రోల్ పంపు వద్ద, సైదాపూర్ రోడ్డు ముక్కపల్లి క్రాస్ రోడ్ వద్ద భక్త సమాజాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోపిక, యశోద, కృష్ణుని వేషధారణలతో చిన్నారులు అలరించారు. చిన్నపిల్లల నృత్యాలతో మహిళల కోలాటాలతో కృష్ణాష్టమి వేడుకల ప్రాంతం ఎంత సందడిగా నెలకొంది. కృష్ణాష్టమి పండుగ ప్రాశస్త్యాన్ని, కృష్ణుని జన్మ వృత్తాంతమును వేద పండితులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
***భగవంతుని కృపతో ప్రజలకు సుఖసంతోషాలు
***ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి**
కృష్ణ భగవానుని కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలిగి ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సూపర్ బజార్ చౌరస్తాలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొని అందరితో కలివిడిగా ఉంటూ సందడి చేశారు.
**కృష్ణాష్టమి వేడుకల్లో ప్రణవ్ బాబు**
గాంధీనగర్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన, టౌన్ సిఐ కరుణాకర్ పాల్గొని, ఉట్టి కొట్టే కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కోడిత్యాల నాగరాజు, సెక్రెటరీ క్యాస రంజిత్ కుమార్, కోశాధికారి కటకం శశాంక్, నాయకులు క్యాస కృప, విక్రాంత్, కార్తీక్, రణదీప్, సాయితేజ, రోహిత్, శివ, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు గందె రాధిక శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు సుద్దాల హరిశంకర్, సెక్రెటరీ నూక శ్రీనివాస్, కోశాధికారి సురేష్, నాయకులు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.








హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సంధర్భంగా ఉట్ల కార్యక్రమంలో పాల్గొని ఉట్టి కొట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..






గాంధీనగర్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు..,





