
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగష్టు 20: హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు రెండవ విడత నిధులు వెంటనే విడుదల చేయాలనీ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్దా ధర్నా చేయాలనీ దళితబందు సాధన సమితి ఆధ్వర్యంలో బాధితులకు పిలుపునివ్వగా ధర్నా కార్యక్రమన్ని అడ్డుకొని ఎక్కడి వాళ్ళను అక్కడే అక్రమ అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. మే 25, 2025న గ్రౌండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు కానీ మూడు నెలలు గడుస్తున్న కనీసం 300మందికి కూడా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతుందనీ వారు ఆరోపించారు.
గతంలో హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం కలిపి సుమారు 44మంది క్లస్టర్ ఆఫసర్ లను నియమించి యూనిట్ వెరిఫికేషన్ చేసి online చేసారనీ దానిని ఇప్పుడు పరిగణలోకి తీసుకోకుండా మండలానికి ఒక స్పెషల్ ఆఫసర్ ను నియమించి యూనిట్ వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉన్నందున దళితబందు లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
కావున వెంటనే ప్రభుత్వం స్పందించి యూనిట్ వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండ స్పెషల్ ఆఫసార్లు లేకుండా కేవలం ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ల ద్వారా డైరెక్ట్ గా ED ఆఫిస్ కి వెళ్లే విధంగా కలెక్టర్ ఆదేశాలు జరిచేయాలన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో దళితబందు సాధన సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సుమారు 5000 కుటుంబాలతో ఆందోళన కార్యక్రమలు చేయడానికి వెనకడుగు వేయమని అరెస్ట్ అయిన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, మహంకాళి రమేష్, కోలుగూరి నరేష్, అకినపల్లి ఆకాష్, గాజుల కుమార్, ఇనుగాలా బిక్షపతి, ఎల్కపల్లి ఉదయ్ కుమార్, అకినపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు బాధితులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు…





