
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటీయూ అనుబంధ) ఎన్నికలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మారెళ్ళీ లత హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మండలంలో మొత్తం 59 మంది ఆశావర్కర్లు ఉండగా, వారిలో 56 మంది ఈ ఎన్నికల్లో పాల్గోన్నారు. వీరిలో 56 మంది ఓట్లు తాడూరీ లతకు (కాట్రపల్లి) వేసీ అధ్యక్షురాలుగా గెలిపించారు. సంపూర్ణ మెజారిటీతో లత ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్షిగా ఏడుమూల సుజాత (శాలపల్లి), కోశాధికారిగా కాలేశ్వరపూ పుష్పలత ( పోతిరెడ్డి పేట) కార్యవర్గ సభ్యులుగా జంగ అరుణ(బోర్నపల్లి), జంగ రమాదేవి (బోర్నపల్లి)తో పాటు పలువురీనీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తాడూరి లత మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 20 ఎళ్ళుగా గ్రామాల్లో చాలి చాలని పారితోషికంతో పనిచేస్తూన్న ఆశావర్కర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తూన్నాయని మండి పడ్డారు. ఆశా వర్కర్ల న్యాయమైన హక్కుల సాధనకు పోరాటం చేస్తానని అన్నారు. ఈఎస్ ఐ, పిఎఫ్, ప్రమాద భీమా, రిటైర్మెంట్ బెనిఫిట్, ఫిక్స్డ్ వేతనం సాధించుకునేంత వరకు పోరాటం అగదని అన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గోన్నారు.

అధ్యక్షురాలిగా ఎన్నికైన తాడూరీ లత

ప్రధాన కార్యదర్షిగా ఎన్నికైన ఏడుమూల సుజాత

కోశాధికారిగా ఎన్నికైన కాలేశ్వరపూ పుష్పలత





