Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని మోడల్ చెరువు, గుండ్ల చెరువుల చుట్టూ తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి విష సర్పాలకు, విష జంతువులకు ఆవాసంగా మారిందని ప్రజాసంఘాల నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ ఖాలీద్ హుస్సేన్ హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. మోడల్ చెరువు గుండ్ల చెరువు సమీపంలో నివసిస్తున్న వారికి నిత్యం పాములు, విష సర్పాలు, విష పురుగులు సంచరించడంతో పాటు పలువురిని కరవగా చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ చెరువు, గుండ్ల చెరువు వద్ద ఏపుగా పెరిగిన ముళ్ళ చెట్లను, పిచ్చి చెట్లను తొలగించి, పాముల బారి నుండి ప్రజలను రక్షించాలని ఖలీదు హుస్సేన్, స్థానిక నాయకుడు కిరణ్ తదితరులు కమిషనర్ కి ఇచ్చిన వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.






