
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, మానకొండూరు శాసనసభ్యుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజేశం చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళులు అర్పించి, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, నరేష్, కిరణ్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.







