
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఎందరో పేద విద్యార్థులకు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి
చేసిన సేవలు చిరస్మరణీయం అని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
కొత్వాల్ శ్రీ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లో ప్రజా సంఘాల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో రామారావు పాల్గొని ఆయన చిత్ర పటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
శ్రీ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గొప్ప సంఘ సేవకులు, విద్యా దాతలని మనిషి కి చదువు చాల అవసరం అని నమ్మినవారని అందుకే రాష్ట్రంలోని ఎన్నో గ్రామీణ పాఠశాలలకు, కళాశాలలకు మరియు వసతి గృహాలకు విరివిగా డబ్బును దానం చేసి ఎంతో ప్రోత్సహించి విశేష సేవలు అందించిన గొప్ప మహనీయుడు మానవతావాదని పోలాడి రామారావు కొనియాడారు.
సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావడమే కష్టతరమైనటువంటి అప్పటి రోజుల్లొ హైదరాబాద్ లోని ఆబిడ్స్ మరియు నారాయణగూడ లాంటి ప్రదానమైన ప్రాంతాల్లో విద్యా సంస్థలను మరియు వసతి గ్రుహాలను నిర్మించారన్నారు.
కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు రెడ్డి హాస్టళ్ళలో ఆశ్రయం కల్గించిన గొప్ప వ్యక్తి అని, అలాంటి మహనీయుడు రెడ్డి వర్గీయుల తో పాటు ఇతర వర్గాల విద్యార్థులకు చేసిన సేవలు చిరస్మరణీయం అని పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకోవడం మన అందరి కనీస బాధ్యత అని రామారావు గుర్తు చేశారు.

మాట్లాడుతున్న ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు





