
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన పులి రుద్రమదేవి (35) రెండు కిడ్నీలు పాడై చికిత్స పొందుతూ శుక్రవారం కరీంనగర్ లోని ఓ దావకానలో మృతి చెందారు. గత కొన్ని నెలల క్రితం రెండు కిడ్నీలు పాడై ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి పలు ప్రైవేట్ ఆస్పత్రిలలో డయాలసిస్ చేయించుకుంటుండగా.. కిడ్నీ మార్పిడి చేయించుకుని ఆర్థిక స్థోమత లేక చికిత్స పొందుతూనే మృతి చెందడంతో చేతిలో చిల్లి గవ్వలేక ఆర్థికంగా కుటుంబం పూర్తిగా చితికిపోయింది. మృతురాలికి భర్త పులి రాజు (38) కూతుళ్లు రష్మిక (10) పరిణిక (7) ఉండగా వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. రెక్క ఆడితే డొక్కాడని కుటుంబమైన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రెండు కిడ్నీలు పాడై చికిత్స పొందుతూ మృతి చెందిన పులి రుద్రమదేవి (35)

మృతి చెందిన తల్లి పార్థివ దేహం వద్ద దీనంగా రోధిస్తున్న కూతుర్లు రష్మిక (10) పరిణిక (7)లు





