
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణ పారిశుద్ధ్యoను పరిరక్షించే పనుల్లో నిత్యం నిమగ్నమై ఉండే హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీకి వెళ్లి అక్కడ ఉపాధ్యాయుడుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో వందరోజుల పారిశుద్ధ్య పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతాప్ వాడ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పిల్లలకు గణితం ఆంగ్లము నైతిక విలువలపై కథలు తెలుగులో అక్షరాలు ఎలా పలకాలి అనే విషయాలపై పిల్లలకు వివరించారు. కాగా పాఠశాల తనిఖీకి వచ్చి పిల్లలకు ఓపికగా పాఠాలు చెప్పిన కమిషనర్ సమ్మయ్యను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుమతి, జ్యోతిరాణి, సాధుల విజయలత, పుల్ల ఝాన్సీ, ప్రసూన, మొగిలి, చంద ప్రభాకర్, సిఆర్పి దామోదరచారి తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు ఓపికగా పాఠాలు చెపుతున్న కమిషనర్ సమ్మయ్య





