
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడీ ప్రభుత్వ కళాశాల మూలమలుపును పట్టించుకొని, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఎండి అప్సర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మూలమలుపు వద్ద కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మూల మలుపు వద్ద లారీలు, కార్లు అతివేగంగా వచ్చి బొల్త పడుతున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఒక లారీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడని ఢీకొని కళాశాల లోపటికి వెళ్ళగా తరగతి గది ధ్వంసం అయింది. ఆ తర్వాత మూలమలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ ఢీ కొట్టి కాంపౌండ్ వాల్, కాలేజీ గేటు ధ్వంసం అయింది. ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఆర్ & బి అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రమాద హెచ్చరికలు మూలమలుపు వద్ద పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల మూలమలుపు వద్ద వెంటనే ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత ప్రజాసంఘాల నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతానని అప్సర్ హెచ్చరించారు.


ప్రభుత్వ జూనియర్ కళాశాల మూలమలుపు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడిన దృశ్యాన్ని చూపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఎండి అప్సర్…





