
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) హుజురాబాద్ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు పాల్గొని కార్యకర్తలకు జాతీయ పునర్నిర్మాణం, జాతీయ భావాలను నింపుతున్న విద్యార్థి పరిషత్ గురించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ నూతన హుజురాబాద్ నగర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా నూతన నగర కార్యదర్శిగా కోయాల అంజి, ఉపాధ్యక్షులు అజయ్, కిరణ్, వినయ్ రంజిత్ సంయుక్త కార్యదర్శులుగా పెరుగు అభిలాష్, హరీష్, అభి, హాస్టల్ ఇంచార్జిగా శివ, శనిగరపు దేవేందర్ లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సభ్యులు పాల్గొన్నారు.


ఏబీవీపీ నగర నూతన కమిటీ సభ్యులతో అతిథులు..





